మార్చి 3 నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 7 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 5 తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్ర దీపాలంకార సేవ, 5, 6 తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దుచేసింది.
మరోవైపు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి, ఏప్రిల్, మే నెలల శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను టీటీడీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇందులో రోజుకు 500 టికెట్ల చొప్పున భక్తులకు అందుబాటులో ఉంటాయి. టీటీడీ జేఈవో కార్యాలయంలో రోజుకు 400 టికెట్లు ఆఫ్‌లైన్‌లో, 100 టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తారు.