తారక్ రాజకీయ ఎంట్రీ పై నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలలోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు.. ప్రస్తుతం ఆయన తన దృష్టి నంతా సినిమాల పైన పెడుతున్నాడు. ఈ క్రమంలోని తారక్ పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించి టీడీపీ నేత నారా లోకేష్ ఆసక్తికర కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో పర్యటిస్తున్న నారా లోకేష్ అక్కడ విద్యార్థులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ ఆహ్వానిస్తుందా? అన్న ప్రశ్నకు నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ సమాధానం తెలిపారు.. ” జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అని అడిగారు.. నూటికి నూరు శాతం ఆహ్వానిస్తాం.. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో.. ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్లాలి.. ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలని ఆశిస్తారో? వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి..” అంటూ తారక్ పొలిటికల్ ఎంట్రీ పై నారా లోకేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇకపోతే తారక్ పొలిటికల్ ఎంట్రీ పై నారా లోకేష్ చేసిన కామెంట్లు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. కుప్పంలో మొదలైన ఈ యువగళం పాదయాత్ర ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. అలాగే ఫిబ్రవరి 24 సాయంత్రం తిరుపతి అంకుర ఆసుపత్రి సమీపంలో హల్ లోకేష్ కార్యక్రమం నిర్వహించగా.. ఇందులో యువత అడిగిన ప్రశ్నలకు లోకేష్ ఆసక్తికర సమాధానాలు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news