ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎంవో అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం శాఖలను కేటాయించింది. బుధవారం సాయంత్రం సీఎంవో అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహార్ రెడ్డి శాఖలను కేటాయించి.. ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డికి.. జీఏడీ, హోం శాఖ, రెవెన్యూ, అటవీ పర్యావరణ, శాసన సభ వ్యవహారాలు, వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమలు, పెట్టు బడులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, మౌలిక వసతులు, రాష్ట్ర విభజన సమస్యలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్ వంటి శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
అలాగే సాల్మన్ ఆరోఖ్య రాజ్ కార్యాదర్శికి పౌర సరఫరాలు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, విద్య తో పాటు అన్ని సంక్షేమ శాఖలు అప్పగించింది. అలాగే ధనుంజయ్ రెడ్డి కార్యాదర్శికి ఆర్థిక, ప్రణాళిక శాఖ, మునిసిపల్ పరిపాలన, ఇంధన, జల వనరులు, వ్యవసాయ అనుబంధ రంగాలు, పర్యాటక, యువజన సర్వీసు శాఖలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
అలాగే ముత్యాల రాజు అదనుపు కార్యాదర్శికి రెవెన్యూ ( ల్యాండ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ), ప్రజా ప్రతినిధుల వినతులు, రవాణా, రోడ్డు, భవనాల శాఖలు, గృహ నిర్మాణం, కార్మిక శాఖతో పాటు నైపుణ్యాభివృద్ధి శాఖలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీనికి సంబంధించని ఉత్తర్వులనున కూడా జారీ చేసింది.