మహిళల్లో ఎక్కువగా వచ్చే కిడ్నీ వ్యాధికి లక్షణాలు ఇవే..!  

-

కిడ్నీ వ్యాధీ ఈరోజుల్లో ఎంతో మందిని వేధిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న ఈ వ్యాధి పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉందని మీకు తెలుసా. సరైన సమసయంలో చికిత్స అందించక ప్రతి సంవత్సరం లక్షలాది మంది మహిళలు మరిణిస్తున్నారు. 30-35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో మూత్రపిండాల వ్యాధి సర్వసాధారణమని WHO చెప్తోంది. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం..ఊబకాయం. కిడ్నీ వ్యాధి వచ్చినా ఆ లక్షణాలు అంత త్వరగా గుర్తించకపోవడం వల్ల సమస్య తీవ్రత పెరుగుతుంది. ఈరోజు మనం ఈ సమస్యకు కారణాలు, స్త్రీలలో వచ్చే కిడ్నీ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.

కిడ్నీ వ్యాధికి కారణాలు:

తక్కువ నీరు తాగడం, షుగర్ లెవెల్స్‌ని నియంత్రించకపోవడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, మధుమేహం, ఎక్కువసేపు మూత్రవిసర్జన చేయడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, అధిక రక్తపోటు, అధికంగా మద్యం సేవించడం ఇవన్నీ కిడ్నీ వ్యాధికి కారణాలు.

 మహిళల్లో కిడ్నీ వ్యాధి లక్షణాలు:

CKD (క్రానిక్ కిడ్నీ డిసీజ్) ఉన్న చాలా మంది వ్యక్తులు దాని తీవ్రతను గుర్తించలేరు ఎందుకంటే శరీరం దాని ప్రారంభ లక్షణాలను తట్టుకోగలదు. వ్యాధి ముదిరే వరకు CKD ప్రభావాలను గుర్తించలేము. మహిళల్లో వచ్చే మూత్రపిండ వ్యాధి కొన్ని లక్షణాలు కింది విధంగా ఉన్నాయి:
అనోరెక్సియా, అలసట, బలహీనమైన అనుభూతి, వికారం, వాంతులు, కండరాల నొప్పులు, తిమ్మిర్లు, జలదరింపు,రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం, చీలమండలు లేదా పాదాల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్రంలో రక్తం, నిద్రలేమి, చర్మం దురద, పొడిబారడం, దృష్టి లేకపోవడం, కళ్ల చుట్టూ వాపు. ఇవన్నీ కిడ్నీ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు.

కిడ్నీ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి:

ఆడవారైనా, మగవారైనా కిడ్నీ వ్యాధి రాకుండా ఉండాలంటే..ధూమపానం, మద్యం సేవించడం తగ్గించండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి..ఊబకాయం తగ్గుతుంది, ఆహారంలో ఎక్కువ మొత్తంలో పండ్లు ,కూరగాయలను చేర్చండి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారించండి. రోజుకు కనీసం నాలుగు లీటర్లైనా వాటర్ తాగండి. ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవద్దు.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి కూరగాయలు, పండ్లు తినాలి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news