సైకో పాలన పోయి – సైకిల్ పాలన వచ్చినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది – నారా లోకేష్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. లోకేష్ చేపట్టిన ఈ పాదయాత్ర నేటికి ఆరవ రోజుకు చేరింది. నేడు పలమనేరు నియోజకవర్గం కృష్ణాపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. బైరెడ్డి మండలం దేవతోటి వద్ద వరినాట్లు వేసే రైతు కూలీల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా రైతు కూలీలతో మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వం వ‌స్తుంద‌ని, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు త‌గ్గిస్తుంద‌ని, పేద‌ల‌కు ఇళ్లు నిర్మిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.

అనంతరం వీ.కోట మండలం కైగల్ గ్రామస్తులు నారా లోకేష్ పాదయాత్ర కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. కైగల్ జలాశయ నిర్మాణానికి టిడిపి ప్ర‌భుత్వం నిధులు కేటాయించినా, వైసీపీ స‌ర్కారు ప‌ట్టించుకోలేదన్నారు. వ్య‌వ‌సాయానికి నీరు ఇచ్చే ఆలోచన లేని జ‌గ‌న్ కొండ‌లు, గుట్ట‌లు, న‌దుల్నీ మింగేస్తున్నాడని ఆరోపించారు. సైకో పాల‌న పోయి – సైకిల్ పాల‌న వ‌చ్చిన‌ప్పుడే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news