సుబ్రహ్మణ్యానిది హత్యే…నిర్ధారించిన ఫోరెన్సిక్ నిపుణులు

వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యగా నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక తో ఫోరెన్సిక్ నిపుణులు హత్యగా నిర్ధారించారు. కొట్టడం తోనే సుబ్రమణ్యం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుబ్రహ్మణ్యం శరీరంలో అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఆయనను పోలీసులు ఏ-1 నిందితుడిగా ప్రకటించారు. అనుమానాస్పద మృతి కేసును కాస్తా.. హత్య కేసుగా మార్చారు. దీంతో ఏక్షణమైనా ఎమ్మెల్సీ ని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

తన భర్త మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి ముందుగా ఎమ్మెల్సీ ని అరెస్టు చేయాలంటూ సుబ్రహ్మణ్యం భార్య రెండు రోజులుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. కగా ఈ ఘటన వెలుగులోకి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఎమ్మెల్సీ అనంతబాబు. ఈ అంశంపై విపక్షాల వాయిస్ పెరగడంతో రచ్చరచ్చ అవుతుంది. దీంతో అనంత బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన వైసీపీ నేతలు.. మంత్రులతో ఆయన టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలని కోరారట అనంత బాబు. అయితే ఎమ్మెల్సీ విన్నపానికి పార్టీ నేతలు పెద్దగా రెస్పాండ్ కాలేదట. కొందరైతే కనీసం కాంటాక్ట్ లోకి కూడా రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.