ఏపీ ప్రజలకు అలర్ట్..3 రోజుల పాటు భారీగా ఎండలు ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రుతుపవనాలు ఆలస్యంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండతీవ్రత ఉండనుంది. నేడు అల్లూరి జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్రవడగాల్పులు ఉండనున్నాయి.
ఏలూరు జిల్లా కుకునూర్, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాల్పులు ఉంటాయి. మరో 212 మండలాల్లో వడగాల్పులు, వడగాల్పులు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. నిన్న ఏన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 43.3°C, ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1°C, అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయిందని.. నేడు అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు…. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.