అమరావతి భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సీట్ పై టిడిపి నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో న్యాయస్థానం స్టే విధించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సిట్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే వాదనలు విన్న సుప్రీం కోర్ట్.. ఏపీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ.. సిట్ దర్యాప్తు కొనసాగించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయడం సరైనదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు అయింది. దీంతో ప్రభుత్వం ఇక సిట్ విచారణను పరుగులు పెట్టించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news