గర్భంతో ఉన్నవాళ్లు ఓఆర్‌ఎస్ తాగుతున్నారా?.. ఒకసారి ఇది వినండి..

-

గర్భంతో ఉన్న మహిళలు ఎప్పుడూ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ప్రతి వాటి గురించి తెలుసుకొనే తీసుకోవడం మంచిది..అంతకు ముందు వరకు తినే విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకపోవడంతో ఇష్టానుసారంగా తిన్న వారు ఎప్పుడైతే గర్భవతి అవుతారో అప్పటి నుండి అసలు సమస్య మొదలు అవుతుంది. ఇష్టమైనది తినకూడదు అంటారు.. తినొచ్చు అనేవి నోటికి రుచి కలిగించవు. అలా గర్భవతులు కొన్నాళ్ల పాటు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా 5వ నెల వచ్చే వరకు చాలా మందికి వాంతులు మరియు వికారం ఉంటుంది. ఏది తినాలన్నా కూడా వాంతులు వచ్చినట్లుగా అనిపించడంతో పాటు అది చూడగానే వికారం అనిపిస్తుంది..

ఓఆర్‌ఎస్ తాగేందుకు సిద్దం అవుతారు. సాధారణంగా అయితే వాంతులు అయ్యి లేదా విరేచనాలు అయ్యి ఇబ్బందిగా ఉన్న వారికి కళ్లు మూసుకుని ఓఆర్‌ఎస్ ఇచ్చేయవచ్చు. కాని గర్భవతుల విషయంకు వచ్చేటప్పటికి వారు తీసుకునే మెడిసిన్‌ మరియు వారి గర్భం పరిస్థితిని బట్టి ఆలోచించాల్సి ఉంటుంది. తాజాగా ఈ విషయమై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఒక మోస్తరుగా వాంతులు వస్తున్న సమయంలో నీరసంగా అవ్వడం వల్ల ఓఆర్‌ఎస్ తీసుకోవచ్చు. ఓఆర్‌ఎస్ తీసుకున్న కూడా గర్బవతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓఆర్ఎస్ అనేది ఇంకా ప్రయోజనం చేకూర్చుతుంది కాని గర్భవతులకు ఎలాంటి ఇబ్బందిని క్రియేట్‌ చేయదు అంటూ నిపుణులు చెబుతున్నారు. కనుక గర్భవతులు వాంతులు అయ్యి డీ హైడ్రేషన్‌ అయిన సమయంలో ఖచ్చితంగా ఓఆర్‌ఎస్ తీసుకోవచ్చు.. కొన్ని నొప్పుల నుంచి కూడా విముక్తి కలుగుతుందని చెబుతున్నారు.. అయితే దీన్ని రోజుకు ఒకటి మాత్రమే తీసుకోవాలి.. అంతకు మించి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..

ఎందుకంటే దగ్గు లేదా జలుబు అయ్యే అవకాశం ఉంది. తద్వారా గర్భంతో ఉన్న సమయంలో ఇతర మెడిసిన్స్ వేసుకోవాల్సి వస్తుంది. గర్బంతో ఉన్న వారు ఇతర ట్యాబ్లెట్లను వేసుకోవడం మంచిది కాదు. తద్వారా ఓ ఆర్‌ ఎస్ అనేది ఎంత వరకు తీసుకోవాలో అంత వరకు తీసుకుంటే బెటర్‌ అంటూ నిపుణులు చెబుతున్నారు. గర్భవతులు ఎక్కువగా వాంతులు అవుతున్నాయి అంటే వారికి ఓ ఆర్‌ ఎస్‌ తో పాటు తప్పనిసరిగా ఇన్‌ స్టాంట్‌ ఎనర్జీ ఇచ్చే ఆహారం అవసరం. వాంతులు అవుతున్నా కూడా కాస్త అన్నం లేదంటే ఏదైనా టిఫిన్ తినాలి. మరో వైపు సాధ్యం అయినంత ఎక్కువగా పండ్లను కూడా తినడానికి ఇంట్రస్ట్ చూపించాలి.. అప్పుడే ఇతర సమస్యలు ఉన్నా తొలగిపోతాయి.. ఇది తప్పక గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news