త్వరలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు – తరుణ్ చుగ్

-

త్వరలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని తెలిపారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్. సంస్థాగత ఎన్నికల తరవాతే పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పు ఉంటుంది.. త్వరలోనే విజయ్ సంకల్ప యాత్రలు… షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. కెసిఆర్ కుటుంబ దోపిడీ రాష్ట్రం దాటి దేశానికి విస్తరించింది.. సుఖేస్ చంద్ర శేకర్ సూట్ కేస్ ల సంగతి చెప్పారని తెలిపారు.

కేజ్రీవాల్, కెసిఆర్ బంధం బయట పడ్డదని.. పార్టీ కార్యాలయం లో పెద్ద పెద్ద షూట్ కేస్ లు ఎలా మారాయన్నారు. లిక్కర్ మాఫియా ఆ కుటుంబ బంధం బయట పడిందని.. విచారణ జరుగుతుందని తెలిపారు. కెసిఆర్ సర్కార్ మునిగి పోయే నావా అని… ఈ రోజు మీటింగ్ లో భవిష్యత్ కార్యాచరణ రూపొందించామన్నారు. ఏప్రిల్ 6 న పార్టీ వ్యవస్థాపక దినం, 11 న పులే జయంతి, 14 న అంబేడ్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్.

Read more RELATED
Recommended to you

Latest news