ఇవాళ TATA కంపెనీతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు నిర్వహించనున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూపు ఛైర్మన్ నజరాజన్ చంద్రశేఖరన్ భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు టాటా గ్రూప్ ఛైర్మనుతో సమావేశం ఉంటుంది. అనంతరం సీఎంతో భేటీ కానుంది CII ప్రతినిధుల బృందం. CII డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు సీఐఐ ప్రతినిధులు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు.
ఇక అటు… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు మొదలెట్టింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. పారిశ్రామిక వేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.