అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాకా రేపుతున్నాయి. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. చాడాదా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. అధికార పక్షం తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేపటి నుంచి శాసనసభ, మండలికి హాజరుకాబోమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ.. గత రెండు రోజులుగా శాసనసభలో ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో చర్చ జరపాలంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో పోడియం వద్ద నిరసన తెలిపారు. మరోవైపు గురువారం 16 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్‌ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ కూడా నిరసన చేసిన ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది.మరోవైపు చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్​ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఈనెల 24వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు జడ్జి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news