BREAKING: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ నేతలతో చంద్రబాబు టెలీ కన్ఫరెన్స్ నిర్వహించారట. ఓటింగ్ బలం లేనప్పుడు పోటీకి వెళ్లకూడదని అధిష్ఠానం క్లారిటీ ఇచ్చింది.
ఈ మేరకు విశాఖ జిల్లా నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు…విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా రు. టీడీపీ కూటమి నిర్ణయంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి బొత్స గెలు పు లాంఛనం అయింది. పోటీ పెట్టకూడదని టీడీపీ కూటమి నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ విజయానికి రూ ట్ క్లియర్ అయింది. పోటీలో బొత్స , స్వతంత్ర్య అభ్యర్థి మాత్రమే ఉన్నారు. ఈ మధ్యానం తో నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో వైసీపీ విజయం సాధించనుంది.