టిడిపి వైరస్ లాంటిది – సజ్జల

తెలుగుదేశం పార్టీ ఓ వైరస్ లాంటిదని.. ఆ వైరస్ అన్ని వ్యవస్థలను పాడు చేస్తోందని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సజ్జల మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని అన్నారు. వైసిపి ఓట్లను టిడిపిలో కలిపేశారని ఆరోపించారు. ఒక్క బండిల్ లోనే 6 ఓట్లు తేడా వచ్చాయని.. అన్ని బండిల్స్ తీస్తే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు.

చివరి దశలో చంద్రబాబు ఉన్నారు కాబట్టి అధికారం కోసం ఆశ పెరుగుతోందని అన్నారు సజ్జల. చంద్రబాబు హయాంలో వ్యవస్థలను తొక్కి పెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని.. అర్జెంటుగా అధికారంలోకి వచ్చేయాలి అన్నది చంద్రబాబు ఆశ అని అన్నారు. కానీ చంద్రబాబు ఆశలు కలలుగానే మిగులుతాయని.. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.