చలో మాచర్లను అడ్డుకున్న పోలీసులు.. టీడీపీ నేతల గృహనిర్బంధం

-

టీడీపీ నేతలు చేపట్టిన చలో మాచర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం గుంటూరు లోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క , ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవి ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనాలని నిర్ణయించడంతో.. తెలుగుదేశం నేతలంతా మాచర్ల వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారు బయటకు రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి జూలకంటిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను కూడా గృహ నిర్బంధం చేశారు. ఏపీలో మరోసారి గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news