BREAKING : టీడీపీ మహానాడు వేదిక ఖరారు అయింది. మే 27, 28 తేదీల్లో నిర్వహించే టీడీపీ మహానాడుకు వేదిక ఖరారు అయినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వేమగిరిలో జాతీయ రహదారిని ఆనుకుని 100 ఎకరాల్లో మహానాడు నిర్వహించే ఆలోచనలో టిడిపి ఉంది.
40 ఎకరాల్లో సభ వేదిక, మిగతా స్థలంలో పార్కింగ్, వంటలు, ఇతర ఏర్పాట్లు చేయనున్నారు. రేపు పలువురు టిడిపి ప్రతినిధుల పరిశీలన అనంతరం అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.