151 పేరు చెప్పి బాబుని ఇబ్బందిపెట్టిన అశోక్ బాబు!

-

మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి.. ఏమాటకు ఎలాంటి అర్ధమొస్తోందో చెక్ చేసుకోవాలి. కానీ.. కొంతమంది విపక్షాలను విమర్శించేస్తున్నాం అనే ఉత్సాహంలో… ఆ విమర్శ కాస్తా బౌన్స్ బ్యాక్ అవుతుందన్న విషయం గ్రహించడంలో విఫలమవుతుంటారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అలాంటి తప్పే ఒకటి చేశారు.. ఫలితంగా ఆన్ లైన్ వేదికగా సెటైర్లు పడిపోతున్నాయి.

రాజ్యసభ ఎన్నికలు, వాటి ఫలితాలపై తాజాగా మైకందుకున్నారు అశోక్ బాబు! టీడీపీని వీడిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో తమ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నారని అశోక్ బాబు విమర్శించారు. ఎందుకయ్యా అంటే… వారి ఓటును కావాలనే చెల్లకుండా ఉండేలా వేశారని. మరి ఆదిరెడ్డి భవానీ ఓటు కూడా చెల్లలేదు కదా అంటే… దానికి ఆయన దగ్గర సమాధానం లేదు! “కనీసం ఓటు వేశారు.. సంతోషం..” అనుకునే పరిస్థితిలో ఇలాంటి కామెంట్లు అవసరమా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. హోం క్వారంటైన్ పేరుచెప్పి అనగాని సత్యప్రసాద్.. బాబును ఇంకా టెన్షన్ లోనే ఉంచుతున్న సంగతి అలా ఉంచితే… ఈ సందర్భంలో ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం అని సర్ధిచెప్పుకున్న అశోక్ బాబు… అవహేళన చేయడం పద్దతి కాదని సూచించారు.

అంతవరకూ బాగానే ఉంది కాని… 151 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ పాలనకు కొలమానం కాదు అని అశోక్ బాబు సెలవిచ్చారు! ఆ ఒక్కమాటతో అశోక్ బాబుపై సెటైర్లు పడిపోతున్నాయి. జగన్ ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా పనిచేయలేదు కాబట్టి… ఆ 151 సీట్లు వైసీపీ పాలనకు కొలమానం అని ఎవరూ అనుకోరు! కానీ… జగన్ కి వచ్చిన ఆ 151 సీట్లతో పాటు టీడీపీకి వచ్చిన 23 సీట్లు మాత్రం… గతంలో బాబు పాలనకు రెఫరేండం అనేది మరోసారి అశోక్ బాబు గుర్తుచేసినట్లయ్యింది. జగన్ కి వచ్చిన 151 సీట్లు ఆయనపై జనాలకున్న నమ్మకానికి కొలమానమో కాదో తెలియదు కానీ… టీడీపీకి వచ్చిన 23ని మాత్రం గత ప్రభుత్వంలో బాబు పాలనకు కొలమానంగా భావించాల్సిన పరిస్థితి. ఇది ఎవరూ కాదనలేని సత్యం!!

ఇప్పటికే తనకు వచ్చిన 23 కంటే… జగన్ కి వచ్చిన 151 నే బాబుని ఎంతగా మానసిక క్షోభకు గురిచేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు! అలాంటి పరిస్థితుల్లో అశోక్ బాబు అస్థమానం ఆ విషయాన్ని కదపడం అవసరమా అని బాబు అభిమానులు ఫీలవుతున్నారు. దీంతో… అనవసరంగా ఆ 151 ప్రస్థావన తీసుకురావడంవల్ల… తనపాలనలో బాబు ఎలాంటి దారుణాలు చేయకపోతే, మరీ అటు 151, ఇటు 23 అవుతుందని ఆన్ లైన్ లో సెటైర్లు పడుతున్నాయి. అనుభవ లోపంతో మాట్లాడే మాటలు ఇలా సెల్ఫ్ గోల్స్ గా మిగిలిపోతాయన్న విషయం అశోక్ బాబుకు వీలైనంత తొందరగా అర్ధం అవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news