ప్రపంచమంతా కరోనా ధాటికి విలవిలాలాడిపోతుంది. అగ్రదేశాలు సైతం వణికిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని లక్షల మందిని బలితీసుకుంది ఈ మహమ్మారి. పరిస్థితులు చూస్తే ఇప్పట్లో దీనికి వ్యాక్సిన్ వచ్చేలా కనిపియట్లేదు. పైగా డిని ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుంది. కొందరిలో ఇది వెంటనే బయటపడితే, మరికొందరిలో మాత్రం దీని లక్షణాలు కనిపించడానికి చాలా సమయం పడుతుంది. పైగా ఈ లక్షణాలు కూడాఆ అందరిలో ఒకేలా ఉండట్లేదు. దగ్గు, ఆయాసం, జ్వరం వంటి లక్షణాలే కాకుండా రుచి, వాసన తెలియక పోవడం వంటి లక్షణాలు కూడా కరోనాకు కారణం అని ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజాగా కళ్లు ఎరుపెక్కడం కూడా కరోనాకు సూచనే అని స్పష్టం చేసింది. కళ్ళు ఎర్ర బారడం, కండ్ల కలక వంటి సెకండరీ లక్షణం కొంతమందిలో కనిపిస్తోందని వైద్యులు సూచించారు. మరో వైపు చూసుకుంటే దీని బారిన నుండి బయటపడిన రెండు మూడు నెలల్లో మళ్ళీ దీని లక్షణాలు కనిపిస్తున్నాయని తెలుస్తుంది.