గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసింది : ఎమ్మెల్సీ అనురాధ

-

శాసనమండలిలో ‌ప్రతిపక్ష‌ సభ్యులు వితండ‌వాదం చేస్తున్నారు. మంత్రులు, మా సభ్యులు వారికి‌ సరైన‌ సమాధానం ‌ఇస్తున్నారు అని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసింది. బటన్ నొక్కి ప్రజల ఎకౌంట్లో డబ్బులు వేయకుండా మోసం చేసింది ప్రభుత్వం. గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది. పోలీసుల్ని వైసిపి కార్యకర్తలుగా వాడుకుని వదిలేసారు. జగన్ ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనార్టీలకు నిధులు కేటాయించ కుండగా మోసం చేసారు. రైతులను మోసం చేసిన పార్టీ వైసీపీ.

ఇరిగేషన్ శాఖలో పనిచేసిన మంత్రులు అవగాహన లేనివారు. పోలవరం ప్రాజెక్టుపై జుడిషియల్ ఎంక్వయిరీ వేసి పోలవరం నిర్మాణం చేయలేదు. మూడు రాజధానులు అంటూ రాజధాని లేకుండా చేసారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల పై కక్ష సాధింపు చేసినారు. ప్యాలెస్ కు, రాళ్లపై ఫోటోలకు, ప్రకటనల పేరుతో 5,871 కోట్లు దుబారా చేశారు. గతంలో ఇరిగేషన్ మినిస్టర్ లుగా‌ పనిచేసిన ఇద్దరిలో‌ ఒకరు‌ రౌడీ షీటర్ లా వ్యవహరించారు. మరొకరు డ్యాన్స్‌ లు వేయడానికి తప్ప ఎందుకూ పనికిరారు అని ఎమ్మెల్సీ అనురాధ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news