ముందు నుండీ ప్రచారం జరిగినట్టే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరి పార్టీ అధ్యక్షులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఆయన ప్రకటించిన పేర్లు ఈ మేరకు ఉన్నాయి. నర్సాపురం తోట సీతారామ లక్ష్మి, గుంటూరు తెనాలి శ్రవణ్ కుమార్, రాజంపేట రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి, హిందూపురం బీకే పార్ధసారధి, నరసరావు పేట నారాయణ రావు, శ్రీకాకుళం కూన రవికుమార్, అనకాపల్లి బుద్దా నాగ జగదీష్, ఒంగోలు నూకసాని బాలాజీ, బాపట్ల ఏలూరి సాంబశివరావులను అధ్యక్షులుగా ప్రకటించారు.
అలానే నెల్లూరు అబ్దుల్ అజీజ్, కర్నూలు సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించారు. విజయనగరం కిమిడి నాగార్జునను నియమించారు. అమలాపురం అనితా కుమారిని ప్రకటించారు. విజయవాడ నెట్టెం రఘురాం ని ప్రకటించింది పార్టీ అధిష్టానం. కాకినాడ జ్యోతుల నవీన్ కి బాధ్యతలు అప్పగించింది. రాజమండ్రికి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ని నియమించారు. నంద్యాల గౌరు వెంకట రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు. తిరుపతిలో నరసింహ యాదవ్ కి బాధ్యతలు ఇచ్చారు. కడపలో లింగా రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. ఈ టీమ్ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడుతుందనీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.