న్యూ స్కెచ్: ఇరకాటంలో పడ్డాంరా “బాబూ” అంటున్న ఇన్ చార్జ్ లు!!

-

 

కోరి కొరివితో తలగోక్కోవడం అంటే ఏమిటో చంద్రబాబు తెలియకపోవచ్చు.. తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ పని చేస్తూ ఉండొచ్చు! కానీ… కొత్తగా ఇన్ చార్జులమయ్యాము.. జనాల్లో ఉన్న కొద్దో గొప్పో గౌరవాన్ని, విలువను కూడా తీసేసేలా, లోకల్ గా మమ్మల్ని మేమే తొక్కేసుకునేలా పథకాలు రచించి మమ్మల్ని ఉసిగొల్పితే ఎలా? అని తెగ ఫీలయిపోతున్నారు కొత్తగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎన్నికైన అధ్యక్షులు! ఎందుకు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

అమరావతి ఉద్యమం 300 రోజులకి చేరుతున్న సందర్భంలో చంద్రబాబు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. దాంతో తాను పీకల్లోతు మునిగిపోవడమే కాకుండా.. పార్టీ నాయకులను కూడా తమకు తామే మునిగిపోమని చెబుతున్నారు అని ఇన్ చార్జ్ లు తలలు పట్టుకుంటున్నారు! అవును.. ఇప్పుడు 300 రోజులకి ఉద్యమం చేరుకుంటున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధం కావాలంటున్నారు చంద్రబాబు.

ఇందులో భాగంగా… రాష్ట్రవ్యాప్తంగా అమరావతి ఉద్యమానికి మద్దతు పలికించాలని.. ఇతర జిల్లాల్లో కూడా నిరసన దీక్షలు, లాంతర్ల ర్యాలీలు చేపట్టాలని.. ఎమ్మార్వో కార్యాలయాల ముందు ఆందోళనలు చేయాలని బాబు పిలుపునిస్తున్నారు. టీడీపీ నాయకులు అంతా మండలాల వారీగా ఎమ్మార్వో కార్యాలయాల ముందు దీక్షలు చేయాలని.. నియోజకవర్గాల వారీగా ప్రెస్ మీట్లు పెట్టాలని.. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా 5 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించాలని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు వినతి పత్రాలివ్వాలని సూచిస్తున్నారు!

అసలు రాయలసీమలో రాజధాని వద్దు.. అమరావతిలోనే పెట్టండి అని రాయలసీమలో ప్రజలు దీక్షలు ధర్నాలు చేస్తారా? ఉత్తరాంధ్రకు ఆ హోదా వద్దు, ఆ గౌరవం వద్దు… మొత్తం రాజధానిని అమరావతికే పరిమితం చేయండి అని వారంతా రోడ్లపైకి వస్తారా? ఇది ప్రాక్టికల్ గా జరిగే పనేనా? ఒకవేల స్థానిక టీడీపీ నాయకులు అలాంటి పిలుపునిస్తే… అసలు టీడీపీ కార్యకర్తలైనా ముందుకు కదులుతారా? బాబుకే తెలియాలి! ఈ బాధ్యతలు అన్నీ తమపైన పెట్టేసరికి ఇన్ చార్జ్ నాయకులంతా ఇరకాటంలో పడ్డాంరా బాబు అంటూ బాదపడుతున్నారంట! కరోనా ఎఫెక్టో ఏమో కానీ… మా బాబు గారికి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేంటని ఫీలవుతున్నారంట!!

 

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news