అధికారపక్షం, టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది.. టీడీపీ నేతలు అని తెలిస్తే చాలు వారిని ఏదో ఒకరకంగా ఇరికించాలని చూస్తుంది.. వారికి ఏ పాపం తెలియకపోయినా బాద పెడుతుంది.. ఏమీ చేయలేని పరిస్థితుల్లో వారి కార్ల అద్దాలు పగలగొట్టి సంతృప్తి చెందుతుంది! ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నది ఇదే అని అంటున్నారు టీడీపీ నేతలు!
ఇప్పుడు టీడీపీ నేతల ఇళ్లల్లో నీళ్లు రాకపోయినా, వారి కార్ల టైర్లలో గాలి తగ్గిపోయినా, వారు అక్రమాలు చేసినప్పుడు అరెస్టులు జరిగినా, వారు హత్య కేసుల్లో హస్తాలున్నట్లు ప్రాథమిక సమాచారం అందిందని అరెస్టు చేసినా, వారు ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నా, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నా.. జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదు! చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎలా చూసీ చూడనట్లు ఉన్నారో.. అలానే ఉండాలని కోరుతున్నారు టీడీపీ నేతలు! అలా కానిపక్షంలో.. అది జగన్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేస్తున్నట్లు వక్రీకరించేస్తారు మరి!
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని గోడలు, మరుగుదొడ్లు కట్టుకున్న సబ్బం హరి పై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకూడదు! అలా చేస్తే… జగన్ సర్కార్ అవినీతిని ప్రశ్నించినందుకు అలా చేసినట్లు! ఎవరో దారినపోయే దానయ్యలో మరెవరో.. పట్టాభి కారు అద్దాలు పగలగొడితే.. వారెవరన్నది పోలీసులు ఇంకా తేల్చకముందే.. అది జగన్ పనే!! కేవలం జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు పట్టాభిలాంటి పోరాట యోధుడు, ప్రజా నాయకుడి కారు అద్దాలు జగన్ పక్కా స్కెచ్ తో పగలగొట్టించారు!!
ఇలా వారి వారి విషయాల్లో జరిగిన ప్రతీ ఘటనకూ జగన్ సర్కార్ కు ఆపాదించడం ఒకెత్తు అయితే… అందుకు వారు చెబుతున్న కారణాలు హైలైట్ అంటున్నారు నెటిజన్లు! అవును… అచ్చెన్నను అవినీతి కేసులో అరెస్టు చేసినా.. జేసీని అక్రమాలకేసులో అరెస్టు చేసినా.. కొల్లు రవీంద్రను హత్య కేసులో సంబంధం ఉందని పోలీసులు అరెస్టు చేసినా.. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని సబ్బం హరి ప్రహారీ గోడను అధికారులు తొలగించినా.. పట్టాభి కారుపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అద్దలు పగలగొట్టినా… అదంతా వారి పోరాటాలకు జగన్ భయపడి చేయిస్తున్న దాడులేనట!
అవును… వారు ప్రజల తరుపున ప్రభుత్వంపై విపరీతంగా పోరాటాలు చేస్తున్నారని, ప్రభుత్వ అవినీతిని భయంకరంగా ప్రశ్నిస్తున్నారని.. వారి దూకుడును భరించలేక, ప్రజల్లో వారికి పెరుగుతున్న పాపులారిటీని తట్టుకోలేక జగన్ ఈర్ష్యతో, తనకు పోతీ ఎక్కడొస్తారో అనే భయంతో, రాజకీయంగా తనకు అడ్డొస్తారనే ఆందోళనలతో దాడులు చేయిస్తున్నారంట!! చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువే కదా!!
-CH Raja