ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు ఇసుక అక్రమ మైనింగ్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు టిడిపి పిలుపునిచ్చింది. అక్రమ మైనింగ్ జరుగుతున్న ఇసుక రీచ్ లో డంపింగ్ యార్డుల వద్ద నిరసనలు చేపట్టి మీడియా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 29న తహశీల్దార్ ఆఫీస్ లు, పిఎస్ లలో ఫిర్యాదు చేయాలని కోరింది. ఈ నెల 30న ఇబ్రహీంపట్నంలోని మైనింగ్ డైరెక్టర్ ప్రధాన కార్యాలయ ముట్టడికి తరలి రావాలని పిలుపునిచ్చింది. కాగా, లెజెండరీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు చిత్రంతో రూపొందిన రూ.100 నాణేన్ని ఇవాళ రాష్ట్రపతి ముర్ము విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం రూ. 100 నాణెం ముద్రించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.