తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీ తీరు తెన్నులు సంస్థాగత పరిస్థితులపై ఆయన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పార్టీలో ఉన్న కొందరు నాయకుల తీరుని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కొందరు నాయకులు అధికారంలో ఉన్న సమయంలో పార్టీ జెండా మోస్తున్నారు అని వారికి చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ చంద్రబాబు ముందే విమర్శలు చేసారు ఆయన.
పార్టీని వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం వదిలేసి వెళ్ళారని ఇప్పుడు వాళ్ళు కనుమరుగు అయ్యారని అన్నారు. ఇప్పుడు రాజకీయంగా పార్టీ బలహీనంగా ఉందని కాబట్టి చంద్రబాబు నాయుడు ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకోవాలని బాగా పని చేసే వారిని మాత్రమే ఆయన ప్రమోట్ చెయ్యాలని, పార్టీకి ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంచార్జ్ లు ముఖ్యం కాదన్న ఆయన కేవలం కార్యకర్తలే ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
పార్టీ నాయకుల తీరు మారాలని, అధికారంలో ఉన్న సమయంలోనే జెండా మోసే విధానం సరికాదని, అధికారంలో ఉంటే ఎవరు అయినా సరే జెండా మోస్తారని అధికారంలో లేనప్పుడు మోసిన వాడే నిజమైన నాయకుడు అని కాబట్టి చంద్రబాబు నాయుడు నాయకుల విషయంలో పరిస్థితుల ఆధారంగా ప్రవర్తించాలని చినరాజప్ప సూచనలు చేసారు. ఆయన మాట్లాడిన ఈ మాటలకు కార్యకర్తల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది.