జగన్ ప్రభుత్వం పై మరోసారి విమర్శనాస్త్రాలు గుప్పించారు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్.వైకాపా ప్రభుత్వం పెంచిన పన్నులపై తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ మండిపడ్డారు.సీఎం జగన్ మాటలు వింటుంటే గాలి పీల్చినా..వదిలినా పన్ను వేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు నారా లోకేష్.” కాదేది బాదుడే బాదుడుకు అనర్హం” అన్నట్లుగా వైకాపా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు.సామాన్యులపై పన్నుల పెంపు భారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.మూడేళ్లలో రెండుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణమని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
చార్జీల పెంపు నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.”వైయస్ జగన్ గారి స్పీడు చూస్తుంటే..గాలి పీల్చినా, వదిలిన “జే ” టాక్స్ వసూలు చేసేలా ఉన్నారు.చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు.కాదేది బాదుడే బాదుడు కి అనర్హం అంటుంది వైసీపీ ప్రభుత్వం.అంటూ నారా లోకేష్ తన ట్విట్టర్ వేదిక ద్వారా జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.
.@ysjagan గారి స్పీడ్ చూస్తుంటే..గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడు కి అనర్హం అంటోంది వైసిపి ప్రభుత్వం.(1/3)#BaadudeBaaduduByJagan pic.twitter.com/YYxC3a9zZM
— Lokesh Nara (@naralokesh) April 13, 2022