సీఎం జగన్ తిరుపతి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వకుళమాత ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రిని కలిసేందుకు పాతకాల్వ గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకుందామని వస్తే పోలీసులు అడ్డుకోవడం పై పాతకాల్వ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే తిరుపతి పేరూరు గ్రామం వకుళమాత ఆలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాల నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం కాన్వాయ్ ని అడ్డుకుంటారనే ఉద్దేశంతో రామానుజ పల్లి చెక్ పోస్ట్ వద్ద వారిని బలవంతంగా అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.