చంద్రబాబు అపర భగీరథుడు..రాయలసీమ మొనగాడు అంటూ కొనియాడారు మాజీ మంత్రి టి.జి.వెంకటేష్. తిరుపతిలో మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ మాట్లాడుతూ…. రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉంది…రాయలసీమలో పెండింగ్ లో ఉన్న సాగు-తాగునీటి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయన్నారు. పెన్నా-గోదావరి నదుల అనుసంధానానికి సిఎం భగీరథ యజ్ఞం చేస్తున్నాడు… సిద్థేశ్వరం బ్యారేజ్ ను ఐకాన్ బ్రిడ్జ్ గా మార్చాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.
విభజన హామీల్లో వచ్చింది తీసుకోవాలి..లేని దాని కోసం పాకులాడకూడదని… విభజన హామీలు వచ్చే వాటిపై కామెంట్ చేస్తే మనకే నష్టం అని చెప్పారు. ఫ్యాక్షన్ ను అణచి వేయడంలో చంద్రబాబు దిట్ట అని… రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం అని… మోడీ ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయి.. మోడీ ఆశీస్సులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. మదనపల్లి దగ్ధం కేసులో చట్టం తన పని తాను చేస్తోంది.. తప్పు చేసి ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు మాజీ మంత్రి టి.జి.వెంకటేష్.