తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ టిజి వెంకటేష్. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం లేదు….గతంలో 6 నెలలు ముందుగానే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారని…ఇపుడు అలా కుదరదన్నారు.
ఒక్కోసారి ఎన్నికలు నిర్వహించడంతో వ్యయభారం, అభివృద్ధి కుంటుపడుతుందని కేంద్రం భావిస్తుంది….కేసిఆర్ ప్రభుత్వ పదవీకాలం ముగిసిన తరువాత రాష్ట్రపతి పాలన లేదా సుప్తచేతనావస్థలో కొనసాగించే అవకాశం ఉందని బాంబ్ పేల్చారు.
కేసీఆర్ రాష్ట్ర విభజన తరువాత ఏపీ పై అభ్యంతరకరమైన భాష మాట్లాడి తప్పు చేశారని ఫైర్ అయ్యారు టిజి వెంకటేష్. జనసేన తో బీజేపీ పొత్తు ప్రస్తుతానికి ఉంది… రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పారు. బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు…. కేంద్ర ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి పరస్పర సహకారం ఉందని తెలిపారు. ఎన్నికల్లో కూడా ఏపీ లో వైసీపీకి, బీజేపీ అలాగే ఉండాలని లేదు…ప్రభుత్వం వేరు, పార్టీ వేరని తెలిపారు టిజి వెంకటేష్.