నిన్న తాడేపల్లి సీఎం ఆఫీస్ లో వైసీపీ ప్రజాప్రతినిధులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో గడపగడపకి మన ప్రభుత్వం గురించి రీవ్యూ, మరియు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి చర్చలు జరిగాయి. కాగా తాజాగా మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు సీఎం జగన్ గురించి సెటైరికల్ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. నిన్న మీటింగ్ గురించి గంటా మాట్లాడుతూ మీటింగ్ లో జగన్ వ్యవహారం పూర్తిగా మారిపోయింది అన్నారు.
ఈ మీటింగ్ కు ముందు జగన్ సరిగా పనిచేయని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ నిన్న మీటింగ్ లో మాత్రం ఎమ్మెల్యే లను ప్రశ్నించే స్థాయి నుండి బుజ్జగించే స్థాయికి వెళ్లిపోవడం ఆయన వెనక్కు తగ్గాడన్నారు. ఇదంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలే కారణమని చెప్పారు.