బ్రేకింగ్: ఏపీలో వీళ్ళకు వ్యాక్సిన్ ఫ్రీ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించిన ఏపీ సర్కార్… 18 నుంచి 45 లోపు ఉన్న వాళ్లకు వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 2 కోట్ల 4 లక్షల మంది వ్యాక్సిన్ ని ఫ్రీ గా అందిస్తారు.

మే 1 నుంచి ఈ వ్యాక్సిన్ ని అందిస్తారు. ఇక ఏపీలో ఆక్సీజన్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర సర్కార్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కర్ఫ్యూ విధించకపోతే మాత్రం ఏపీలో కేసులు ఆగే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.