మంత్రి అంబటి పిటిషన్ డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు

-

ఆంధ్రప్రదేశ్ లో మే 13న లోక్ సభ, శాసనసభకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేశారని.. పోలీసులు అరెస్ట్ చేస్తారని సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబు నిన్న దాఖలు చేసిన  పిటిషన్ ని తాజాగా డిస్మిస్ చేసింది  ఏపీ హైకోర్టు.

సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని 236, 237, 253, 254 పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు గతంలో సుప్రీంకోర్టు వాదించిన కేసులను కోర్టు పరిగణలోకి తీసుకొని అంబటి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. మంత్రి అంబటి రాంబాబుతో పాటు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా రీ పోలింగ్ నిర్వహించాలని పిటిషన్ వేశారు. దీంతో వీరిద్దరి పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news