రాత్రికి రాత్రే ముస్లింలకు, చొరబాటుదారులకు ఓబీసీ సర్టిఫికేట్లు జారీ : మోడీ

-

దేశంలో ఎన్నికల ప్రచారము తుది దశకు చేరుకున్న నేపథ్యంలో నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నా విషయం తెలిసిందే. తాజాగా నరేంద్ర మోడీ సీఎం మమతా బెనర్జీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు దేశం కన్నా వారి ఓటుబ్యాంకు ముఖ్యమని మండిపడ్డారు.హర్యానాలో ఎన్నికల ప్రచారం లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మోడీ రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని స్పష్టం చేశారు. కలకత్తా హైకోర్టు 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికేట్లను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని మోడీ విరుచుకుపడ్డారు. ”పశ్చిమ బెంగాల్‌లో వారు రాత్రికి రాత్రే ముస్లింలకు, చొరబాటుదారులకు ఓబీసీ సర్టిఫికేట్లు జారీ చేశారు అని విమర్శించారు. గత 10-12 ఏళ్లలో ముస్లింలకు జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లను హైకోర్టు రద్దు చేసింది. కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సీఎం మమతా బెనర్జీ అంగీకరించడం లేదని, వారు ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇది ఇండియా కూటమి మనస్తత్వం” అని ప్రధాని మోడీ మండిపడ్డారు.

 

కాంగ్రెస్, టీఎంసీ, ఇతర ఇండియా కూటమికి చెందిన పార్టీలు వారి ఓటు బ్యాంకుకు మద్దతు ఇస్తున్నాయని, అయితే మోడీ జీవించి ఉన్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news