జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య వ్య‌వ‌హారంలో ఎల్లో మీడియాకు బిగిస్తున్న ముడి..!

-

ప్ర‌స్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌, జ‌డ్జి రామ‌కృష్ణ‌ల ఫోన్ సంభాష‌ణ‌ల వ్య‌వ‌హారం.. ఎటు మ‌లుపు తిరుగుతుందోన‌న్న ఉత్కంఠ స‌ర్వ‌త్రా క‌నిపిస్తోంది. ఈ ఫోన్ సంభాష‌ణ‌ల వ్య‌వ‌హారంలో ఎల్లో మీడియా అతి ఉత్సాహం చూపిస్తోంద‌నే విష‌యం తెలిసిందే. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో సీఎం జ‌గ‌న్‌ను, ఆయ‌న ప్ర‌భుత్వాన్ని దోషిగా కోర్టులో నిల‌బెట్టాల‌నే ప్ర‌ధాన వ్యూహం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి ఇది జ‌డ్జి రామ‌కృష్ణ స్వ‌యంగా ఈశ్వ‌ర‌య్యకు ఫోన్ చేసిన నేప‌థ్యంలో వ్య‌క్తిగ‌తంగా రామ‌కృష్ణ‌తో ఉన్న చ‌నువు నేప‌థ్యంలో సంభాషించారు.

ఇది స‌హ‌జంగా ఎవ‌రు ఎవ‌రితో అయినా ఫోన్‌లో మాట్లాడిన‌ప్పుడు అవ‌తలి వ్య‌క్తి..త‌మ సంభాష‌ణ‌ను రికార్డు చేసి.. రోడ్డున పెడ‌తార‌ని ఎవ‌రూ అనుకోరు. కానీ, జ‌స్టిస్ ఈశ్వ‌రయ్య విష‌యంలో ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌డ్జి రామ‌కృష్ణ వ్య‌వ‌హ‌రించిన తీరు.. దీనివెనుక కుట్ర ఉంద‌నేది క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిని అందిపుచ్చుకున్న  ఓ ఎల్లో మీడియా.. జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య.. కోర్టుల వ్య‌వ‌హారంలో జ‌గ‌న్‌ను న‌డిపిస్తున్నార‌ని, ఇటీవ‌ల అమ‌రావ‌తి విష‌యంలోను, తెలుగు మీడియం విష‌యంలోనూ కోర్టు ఇచ్చిన తీర్పులపై వైఎస్సార్ సీపీ నేత‌ల‌తో వ్యాఖ్య‌లు చేయించ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని ఎల్లోమీడియా రాద్ధాంతం చేసింది.

మొత్తంగా చూస్తే.. ఈశ్వ‌రయ్య వ్య‌వ‌హారం.. హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తుల‌ను, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను దుర్భాష‌లాడార‌ని, ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను అరెస్టు చేయాల‌ని జ‌డ్జి రామ‌కృష్ణ డిమాండ్ లేవ‌నెత్తారు. అయితే, వాస్త‌వానికి ఇలా ఒక వ్య‌క్తిని న‌మ్మించి ట్రాప్‌లోకి దింపి.. అత్యంత జాగ్ర‌త్త‌గా వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేయించిన విష‌యం స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది.

ఈ క్ర‌మంలో ఈ కేసులో న్యాయ వివాదం చెల‌రేగిన‌ప్ప‌టికీ.. పూర్తిగా చూస్తే.. ఈశ్వ‌ర‌య్య నేరుగా త‌ప్పుచేసిన‌ట్టు క‌నిపిస్తున్నా.. కుట్ర కోణం ఎక్కువ‌గా ఉన్న ఈ కేసులో జ‌డ్జి రామ‌కృష్ణ ఉద్దేశ ‌పూర్వ‌కంగా ఈశ్వ‌ర‌య్య‌ను ఇరికించార‌నేది న్యాయ‌నిపుణులు కూడా చెబుతున్న మాట‌. మొత్తంగా ఇది టీక‌ప్పులో తుఫాను మాదిరిగా తేలిపోతుంద‌ని, జ‌గ‌న్‌పైనా ఆయ‌న ప్ర‌బుత్వంపై బుర‌ద‌జ‌ల్లాల‌ని అనుకున్నా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం ద‌క్క‌ద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news