ఏపీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బాలిక మిస్టరీ ఘటన..!

-

తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం మండలం, తూర్పుగానుగూడెం లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాలిక మిస్టరీ ఘటన.  ఆసుపత్రిలో ప్రసూతి అయినా వారం రోజులు తరవాత బిడ్డను తల్లి నుండి తీసుకుపోయినట్ల కలెక్టర్ కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసింది తల్లి కొర్రపు ఆదిలక్ష్మి. తన భర్తను మద్యానికి బానిస చేసి తన బిడ్డను తీసుకుపోయారంటూ జిల్లా కలెక్టర్, అధికారుల ముందు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఐదేళ్లుగా బిడ్డ కోసం తల్లి  తపన పడింది.

తన బిడ్డను వెతికి ఇప్పించవలసిందిగా కోరుతూ కలెక్టర్ కి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడిందించిన బాలిక తల్లి ఆదిలక్ష్మి. స్పందించిన కలెక్టర్ ప్రశాంతి బాలిక వివరాలను 24గంటల్లో తెలుపాలని ఆదేశాలు జారీ చేయడం తో కదిలిన అధికార యంత్రాంగం. కలెక్టర్ అదేశాల తో బాలిక మిస్సింగ్ మిస్టరిని చేధించారు అధికారులు. రంగంలో దిగిన అధికారి యంత్రాంగం గాను గూడెం లోని ఎంక్వయిరీ చేసి, 10 గంటల వ్యవదిలో బాలిక ఆచూకిని కనిపెట్టారు పోలీసులు. టెక్నీకల్ ద్వారా రాజమండ్రి లో బాలిక ఆచూకిని కనుగొని అధికారులు సంరక్షణ తీసుకున్నట్లు తెలిపిన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాజ్ కుమార్. బాలిక మిస్సింగ్ పై తల్లి తో పోలీసులకు ఫిర్యాదు చేయించారు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాజ్ కుమార్. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news