బస్సు కిటికీలో ఇరుక్కున్న ప్రయాణికుడి తల… 15 నిమిషాలు నరకయాతన..!

-

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, శుభప్రదం అనేది ఆ సంస్థ స్లొగన్. అలాంటి RTC బస్సు కిటికీలో ఓ ప్రయాణికుడి తల ఇరుక్కున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరా గాంధీ జంక్షన్ వద్ద బుధవారం ఓ వ్యక్తి తల బస్సు కిటికీలో ఇరుక్కుంది. సంతబొమ్మాలికి చెందిన సుందర్ రావు అనే వ్యక్తి ఆర్టీసీ బస్సులో వస్తూ ఫిక్స్డ్ కిటికీ డోర్ నుంచి తల బయటకు పెట్టాడు. అంతే తిరిగి తలను లోపలకు తీసుకునేందుకు ప్రయత్నించగా మెడ నుండి పై భాగం లోపలికి రాకుండా అక్కడే ఇరుక్కుపోయింది.

ఎంతగా ప్రయత్నించినా తల లోపలకు రాలేదు. సుమారు 15 నిమిషాలు అవస్థలు పడుతుండడంతో గుర్తించిన డ్రైవర్ బస్సును టెక్కలిలో ఆపి కిటికీలో ఇరుక్కున్న ప్రయాణికుడి తలను సురక్షితంగా తీసేందుకు స్థానికుల సహాయంతో ప్రయత్నాలు చేశారు. చివరకు బస్సు లోపల నుండి కొందరు బయట నుండి కొందరు గట్టిగా తలను అదిమి పట్టుకొని బలవంతంగా లాగగా ఎట్టకేలకు ప్రయాణికుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి బస్సు కిటికీలో తల ఇరుక్కు పోయి సుమారు 15నిమిషాలు హడావిడి జరగటంతో అందరి నోట ఇదే చర్చ జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news