రాజకీయాల్లో బలవంతపు పొత్తులు ఉండవన్నారు బిజెపి ఎంపీ జేబీఎల్ నరసింహారావు. జనసేనతో పొత్తుపై స్పందించిన జివిఎల్ ఇప్పటికీ ఆ పార్టీతో కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. రాజకీయాలలో ఎవరు ఎవరినైనా కలవచ్చని తెలిపారు. జనసేన పార్టీతో బిజెపి పొత్తులో ఉందని స్పష్టం చేశారు. బిజెపిని కుట్రపూరితంగా బలహీనపరచాలని రాజకీయాలు చేస్తే అది ఎవరైనా సరే తస్మాత్ జాగ్రత్త..! అంటూ హెచ్చరించారు.
ఈసారి బిజెపి చూస్తూ ఊరుకోదు అని అన్నారు జీవీఎల్. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశాయని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. బిజెపిపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.