మేదరమెట్ల లో ఉప్పెనలా వచ్చిన జనసమూహం కనిపిస్తోంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభకు హాజరై ప్రసంగించారు సీఎం జగన్. పేద వాడికి అండగా తోడుగా నిలబెడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా..? అని అడుగుతున్నాని తెలిపారు జగన్. పార్టీల పొత్తులతో బాబు, ప్రజలే బలంగా మనం తలబడబోతున్న ఈ మహాసంగ్రామానికి మీరంతా సిద్దమేనా..? అని ప్రశ్నించారు. జగన్ ని ఓడించాలని వారు.. పేదలను గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చాణక్యుడిగా విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా సిద్ధమేనా అడుగుతున్నాను.
సిద్ధం అంటే.. ప్రజలు చేసే యుద్దం.. ఓ ప్రజా సముద్రం.. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం, ఉత్తర కోస్తా సిద్దం, రాయలసీమ సిద్ధం. ఈరోజు దక్షిణకోస్తా కూడా సిద్ధం అని చెప్పారు సీఎం జగన్. జరుగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ, అధర్మానికి జరిగే యుద్ధంలో ప్రజలది శ్రీ కృషడి పాత్ర.. అర్జునుడి పాత్ర నాది.. మీ ఓటు హక్కును ప్రయోగించాల్సిన సమయం వచ్చేసింది. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే మీరంతా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.