చంద్రబాబు ఆలోచనలో స్వార్థం ఉందన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. రాజధాని సమస్యను రాష్ట్ర సమస్యగా సృష్టిస్తున్నారని.. ఇది చంద్రబాబు ఎత్తుగడలో భాగమేనన్నారు. అమరావతి రాజధాని వెనుక దురుద్దేశాలను అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి అనుభవాలను, వాస్తవాలను తెలిపామన్నారు.
హైదరాబాదును విడదీయడాన్ని రాష్ట్ర ప్రజలు ఎందుకు వద్దని చెప్పారంటే.. పెట్టుబడి అంతా అక్కడే పెట్టాం, అభివృద్ధి అక్కడే జరిగిందన్నారు. అందుకే రాష్ట్ర విభజన తెలంగాణ వారు కోరుకున్నారని అన్నారు మంత్రి ధర్మాన. రాష్ట్ర నలుమూలలా అభివృద్ధి జరిగితే తెలంగాణ వారు కోరేవారేే కాదన్నారు. గడిచిన 65 సంవత్సరాలు ఒకే దగ్గర ఆదాయాన్ని ఇన్వెస్ట్ చేశామని.. తెలంగాణలో జరిగిన పని మరల జరగదని ఎవరైనా చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి ఉత్తరాంధ్ర నువ్వు పొమ్మంటే మరింత వెనకబడుతామన్నారు.
శివరామకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు మరుగున పెట్టారని ప్రశ్నించారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఎందుకు ఒకే ప్రాంతంపై దృష్టిి పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు తన స్నేహితులు, బంధువులచే భూములు కేటాయింపు చేశారని ఆరోపించారు. విశాఖ క్యాపిటల్ వద్దంటే ఊరుకోం అన్నారు మంత్రి ధర్మాన.