లావా నుంచి బ్లేజ్ స్మార్ట్ ఫోన్ మన దేశంలో జులైలో లాంచ్ అయింది.. ఇప్పుడు అందులో ప్రో మోడల్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధం అవుతోంది. లావా బ్లేజ్ ప్రో పేరుతో ఫోన్ ఈనెలలో లాంచ్ కానుంది.
లావా షేర్ చేసిన ట్వీట్‌ను బట్టి ఈ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. బ్లూ, గోల్డ్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇవి తప్ప ఈ ఫోన్ గురించి మిగతా సమాచారాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ.. ఫోన్‌కు సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ లీకుల ప్రకారం… లావా బ్లేజ్ ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది.
6x జూమ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించనున్నారు. హోల్ పంచ్ కటౌట్ కూడా ఉండనుంది. లావా బ్లేజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ జులైలో మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధరను రూ.8,699గా నిర్ణయించారు. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్, గ్లాస్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు.
దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, హోల్ పంచ్ తరహాలో డిజైన్ ఉంది.
మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
3 జీబీ ర్యామ్ ఇందులో అందించారు. మరో 3 జీబీ స్టోరేజ్‌ను వర్చువల్ ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తంగా 6 జీబీ ర్యామ్ ఉండబోతుంది.
64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
4జీ వోల్టే, బ్లూటూత్ వీ5, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై, జీపీఆర్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉన్నాయి.
యాక్సెలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌ను కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.