నేడు గడప గడపకు మన ప్రభుత్వం పై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కోఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అయితే ఈ సమీక్షలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రానున్న తొమ్మిది నెలలు చాలా కీలకమని సూచించారు.
నియోజకవర్గ సర్వేలలో అనుకూలంగా లేని వారికి తిరిగి టికెట్లు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో 175 సీట్లను కచ్చితంగా గెలవాలని టార్గెట్ ను ఫిక్స్ చేశారు. పనితీరును మెరుగుపరచుకోలేని వారిని తప్పించడం ఖాయం అన్నట్లుగా తెలుస్తోంది. సర్వే చేసినప్పుడు మీ మీ గ్రాఫ్ లు బలంగా ఉండాలని.. దీనికోసం గడప గడపకు కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. అలా జరగకపోతే మార్చక తప్పని పరిస్థితి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది.