అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మన్యంలో పుష్ప సీన్ రిపీట్ అయింది. ఈ అటవీ ప్రాంతంలో ఉన్న టేకు ప్లాంట్ లో మాయమైన టేకు చెట్ల బాగోతం బయటపడుతోంది. గుట్టుచప్పుడు కాకుండా 400 పైనే భారీ టేకు, మారు జాతి వృక్షాలు మాయం చేశారు. అధికారుల కనుసన్నల్లోనే 50 లక్షల పైనే విలువైన టేకు చెట్లను అటవీ సిబ్బంది చొరవతోనే జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ చేశారు అధికారులు.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి సిబ్బందిపై అటవీ ప్రాంతంలో మాయమైన టేకు చెట్ల వివరాలను సేకరిస్తున్నారు సీసీఎఫ్,స్క్వాడ్,విజిలెన్స్ టీం ఉన్నతాధికారులు. టేకు చెట్ల అక్రమ దోపిడిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి, జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలు రంపచోడవరం డివిజన్ లోని అన్ని రేంజ్ పరిధిలో టెక్ ప్లాంటు లను పరిసలించి అవినీతి అధికారులు డేటాను పంపారు విజిలెన్స్ అధికారులు, ప్రత్యేక బృందాలు. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఇప్పటికే డిప్యూటీ రేంజ్ అధికారి,బీట్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.