రేపటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. కోవిడ్ ఎఫెక్ట్ తో ఏకాంతంగా !

-

ఇవాళ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నామని రేపు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 23వ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీవారికీ పట్టువస్త్రాలు సమర్పిస్తారని, 24వ తేదీ సీఎం శ్రీవారిని దర్శించుకొని నాదనీరాజనం వద్ద వేదపారాయణం కార్యక్రమంలో పాల్గొంటారని చెబుతున్నారు. 24వ తేదీ కర్ణాటక సత్రం శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గోని తిరుగు ప్రయాణం అవుతారని పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసమే ఈ ఏట బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని, ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కల్యాణోత్సవ మండపంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మహారధం, స్వర్ణ రధం బదులుగా సర్వభూపాల వాహనం పై స్వామి వారికి వాహన సేవ నిర్వహిస్తారని తెలుస్తోంది. డైరీల సంఖ్యను తగ్గించామని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని, కరోనా కారణంగా భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని 2021 డైరీలు ముద్రణను 25 శాతం తగ్గించామని పేర్కొన్నారు. టీటీడీలో ఎక్కడ అన్యమత ప్రచారం జరగలేదన్న ఆయన తిరుమలలో దళారి వ్యవస్ధను… అవినీతిని పూర్తిగా నిర్మూలించామని అన్నారు. స్వామివారి డబ్బు దుర్వినియోగం కాకుండా చూస్తున్నాంమని గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు చరిత్రలో ఎన్నడూ జరగలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news