తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమల శ్రీవారి నడకదారిలో వన్యప్రాణుల సంచారం కొనసాగుతోంది. తాజాగా ట్రాప్ కెమరాలు ద్వారా చిరుత సంచారాన్ని గుర్తించారు అటవి శాఖ అధికారులు. ఈ చిరుత సంచారం నేపథ్యంలో భధ్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తోంది టిటిడి పాలక మండలి.

తిరుమల శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే తిరుమల శ్రీవారి నడకదారిలో వన్యప్రాణుల సంచారం చోటు చేసుకుంది. గతేడాది.. ఓ చిన్నారిపై చిరుత దాడి చేసి.. చంపేసిన సంగతి తెలిసిందే.