ఏంజియోగ్రాం చేయాలంటే కరోనా నిర్దారణ పరీక్షలు కచ్చితం అంటున్న తిరుపతి వైద్యులు…!

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కరోనా పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు తాజాగా విడుదల చేసిన బులిటెన్ లో ఏకంగా ఒక్క రోజే 10 వేల పైగా కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరంలో గుండెకు సంబంధించిన రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని కారణం తిరుపతి నగరంలోని స్విమ్స్ ఆస్పత్రిలో ఏంజియోగ్రాం చేయడానికి కచ్చితంగా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకొని ఉండాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో గత మూడు రోజుల నుండి కార్డియాలజీ విభాగంలోని రోగులు నానా అవస్థలు పడుతున్నారు.

angiography
angiography

ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభాగంలో ఉన్న రోగులు కరోనా పరీక్షలు చేయించుకున్న వాటి ఫలితాలు రావడానికి ఆలస్యమవుతున్నాయి. ఒకవేళ వచ్చినా అక్కడి రోగులకు కొంతమందికి పాజిటివ్ అని నిర్ధారణ జరుగుతోంది. దీంతో వారితో పాటు కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పరిస్థితి ఇలా ఉండగా, తిరుపతి నగరంలోని కొన్ని గుండెకు సంబంధించిన ప్రైవేట్ వైద్యశాలలో ఉన్న సిబ్బందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో అవి కాస్త మూతపడ్డాయి. దీంతో తిరుపతి నగరంలోని కార్డియాలజీ రోగులు ఏం చేయాలో తెలియక ప్రాణ భయంతో అల్లాడుతున్నారు. నగరంలో పరిస్థితి ఇలా ఉన్న కూడా గుండె సంబంధిత రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ఎటువంటి ప్రత్యేక చర్యలు చేయలేకపోతున్నారు స్విమ్స్ ఉన్నతాధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news