సంగం బ్యారేజికి…మేకపాటి గౌతంరెడ్డి పేరు పెడతామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేశారు. సంగం ప్రాజెక్టుకు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా పెడతామని అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. నా సహచరుడు, మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి లేడని ఊహించడం కష్టంగా ఉందని.. గౌతమ్ మృతి పార్టీకి, నాకు, రాష్ట్రానికి లోటు అని కచ్చితంగా చెప్పగలనని వివరించారు.
గౌతమ్ నాకు చిన్నతనం నుంచి స్నేహితుడని.. వయస్సులో నా కన్నా ఒక్క సంవత్సరం పెద్దవాడైనా నన్ను అన్న అని పిలిచేవారన్నారు. ఒక మంచి స్నేహితుడిని ఎమ్మెల్యేను పోగొట్టుకున్నామని… యూకే లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధాంత పరంగా నేను బయటకు వచ్చాను.. గౌతమ్ అప్పుడే నాతో నిలబడ్డారని… అతని తండ్రిని కూడా నాతో గౌతమ్ నడిపించారన్నారు.
నా కెబినెట్లో 6 శాఖలు నిర్వహించారని.. దుబాయ్ వెళ్లే ముందు నన్ను కూడా కలిశారు.. నేను అల్ ద బెస్ట్ కూడా చెప్పానని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరిలోని రాజమోహన్ రెడ్డి కళాశాలకు గౌతమ్ పేరు పెట్టాలని దాన్ని వ్యవసాయ, హార్టీ కల్చర్ కాలేజీ కౌర్స్ పెట్టాలని కోరారు దానికి ఏర్పాట్లు చేస్తామని.. ఉదయగిరి ప్రాంతాన్ని వెలుగొండ ఫేస్-1లోనే తీసుకువస్తామని హామీ ఇచ్చారు. నాడు-నేడు కార్యక్రమంలో ఫేస్-2 కింద ఉదయగిరి కళాశాలను అభివృద్ధి చేస్తామన్నారు.