నేడే రాయలసీమ గర్జన సభ..లక్షల మందితో సభ !

ఇవాళ వైసీపీ మద్దతుతో జేఏసీ రాయలసీమ గర్జన సభ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమ జిల్లాల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు హాజరుకానున్నారు. లక్ష మందిని సమీకరించాలని వైసీపీ లక్ష్యం పెట్టుకుంది. ఈ రాయలసీమ గర్జన సభ కర్నూల్ లో జరుగుతోంది.

3 రాజధానులకు మద్దతుగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ గర్జన నిర్వహిస్తున్నారు.  అలాగే రాయలసీమ గర్జన సభ వేదికపై 150 మంది నేతలు ఉండనున్నారు. ఇక రాయలసీమ గర్జన సభలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వైసీపీ నేతలు, మూడు రాజధానులకు మద్దతు ఇచ్చే వారు తరలిపోతున్నారు. ఇక అటు రాయలసీమ గర్జన సభను టిడిపి, కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.