సిబ్బంది అప్రమత్తతతో బాలుడిని కాపాడగలిగాం : TTD ఈవో ప్రకటన

-

తిరుమలలో పులి దాడిలో గాయపడిన బాలుడిని TTD EO ధర్మారెడ్డి పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. నడక మార్గంలో బాలుడు తాతతో కలిసి వెళుతుండగా చిరుత దాడి చేసిందని ఈవో చెప్పారు. అయిదుగురు పోలీసులు అరుస్తూ ఫారెస్ట్ లోకి పరిగెత్తారని… భారీగా శబ్దాలు చేయడంతో చిరుత భయపడి బాలుడిని వదిలి వెళ్లిపోయిందని తెలిపారు.

సిబ్బంది అప్రమత్తలతోనే బాలుడిని కాపాడగలిగామని వెల్లడించారు. తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి బాధాకరమని అన్నారు. నడక మార్గంలో భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కాలినడక మార్గంలో భక్తులను యధావిధిగా అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news