తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై TTD ఈఓ సమీక్ష..!

-

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈఓ ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 4 నుండి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల మొదటి రోజు సీఎం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక కొండాపై భద్రతా పరంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నాము. బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవల రద్దు చేసాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసాం.

అలాగే భక్తులను ఆకట్టుకోవడానికి విద్యుత్ అలంకరణ, వాహసేవలు వీక్షించడానికి మాడవీదుల్లో బిగ్ స్క్రీన్ లు ఏర్పాటు జరుగుతుంది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో వసతి గదుల సిఫార్సు లేఖలు, దాతలకు కేటాయింపు వంటివి రద్దు. పారిశుధ్య పరంగ ప్రత్యేక శ్రద్ద తీస్కోంటాము. క్యూలైన్ లో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తాము. మెడికల్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తాము. సాంస్కృతిక కార్యక్రమాలు, కాళ బృందాలు ఏర్పాటు చేస్తున్నాము. ఏడు రాష్ట్రాల నుండి కళాబృందాలు రానున్నాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది నీటి నిల్వలు తగ్గాయి. కాబట్టి రోజు 11 లక్షల గ్యాలన్ల నీటిని మున్సిపల్ కార్పొరేషన్ టీటీడీకి ఇవ్వడానికి అంగీకరించింది. కాబట్టి బ్రహ్మోత్సవాలకు నీటి సమస్య ఉండదని బావిస్తున్నాము అని ఈఓ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news