మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుండి విడుదల అయ్యారు. ఎన్నికల పోలింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని పోలింగ్ స్టేషన్లల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి ధ్వంసం చేశారు. ఈ కారణంగా జూన్ 26న ఆయనను పోలీసులు అరెస్ట్ చేసారు. కానీ నిన్న పిన్నెల్లికి ఏపీ హై కోర్టు శక్తులతో కూడిన బెయిల్ ను పిన్నెల్లికి మంజూరు చేసింది. అయితే నిన్ననే ఆయన జైలు నుండి విడుదల అవుతారు అనుకున్నారు కానీ అలా జరగలేదు.
అయితే ఈతోజు జైలు నుండి బయటకు వచ్చిన పిన్నెల్లి రెప్పపాటు కాలంలో తన వాహనంలో వేగంగా జిల్లా జైలు నుండి వెళ్లిపోయారు. అయితే పిన్నెల్లి తమిళనాడు ,లేదా బెంగళూరుకు వెళ్లిపోయారని పోలీసులు భావిస్తున్నారు. అయితే జైలు నుండి పిన్నెల్లి మాచర్ల వస్తారేమోనని ఆలోచనతో పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు. కానీ ఆయన జిల్లాకు రావడం లేదని సమాచారం అందడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు.