వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు టీచర్లు మృతి..!

-

సాలూరు మండలం లో వాగు దాటుతుండగ ఇద్దరు టీచర్లు ప్రమాదవశాత్తు చనిపోయారు. అయితే ఈ విషయంలో స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. ఇద్దరి టీచర్లు మరణం నాకు బాధ కలిగించింది. అయితే అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇద్దరి కుటుంబ సభ్యులకు మృత దేహాలు అందించాం. అలాగే రెండు కుటుంబాల్లో ఉండే వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు.

అదే విధంగా కేంద్రం నుంచి రూ. 10 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు ఆ కుటుంబానికి అందజేయనున్నట్లు కూడా పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి సాయం అడిగినా ఇమ్మని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే నిన్న అనకాపల్లిలో జరిగిన హాస్టల్ సంఘటనలో కలుషితాహారం తిని ముగ్గురు చనిపోయారు. కాబట్టి గుర్తింపు లేని హాస్టళ్లు నడిపే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చారు అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news